
మెదక్ టౌన్, వెలుగు: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని కలెక్టర్రాజర్షిషా అధికారులకు సూచించారు. సోమవారం మెదక్ కలెక్టర్ఆఫీసులో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి సాధ్యమైనంత త్వరలో పరిష్కారించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మొత్తం 81ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ఇందులో ధరణి, భూసమస్యలు 32, పెన్షన్ 4, విద్య, వైద్య , ఉపాధి5, ఇతర సమస్యలు 40 వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎల్లయ్య, మైనింగ్ అధికారి జయరాజ్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
సంగారెడ్డిలో..
సంగారెడ్డి టౌన్: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టర్ఆఫీసులో అధికారులతో కలిసి ఆమె ఫిర్యాదులన స్వీకరించారు. అనంతరం కలెక్టర్మాట్లాడుతూ.. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జి దారుల నుంచి మొత్తం 50 అప్లికేషన్లు వచ్చినట్లు తెలిపారు.
ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 20, ఇతర శాఖలకు సంబంధించి 50 అప్లికేషన్లు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయాలంటే అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, ప్రతి అప్లికేషన్ పరిశీలించి అర్హులను బట్టి న్యాయం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సిద్దిపేటలో..
సిద్దిపేట టౌన్: సిద్దిపేట జిల్లా కలెక్టర్ఆఫీసులో సోమవారం డీఆర్‌వో నాగరాజమ్మ ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజావాణికి మొత్తం 45 అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు. ఇందులో భూ సంబంధిత, డబుల్బెడ్రూం, ఆసరా పింఛన్లకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అనంతరం స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ నాయకులు ప్రణయ్ కుమార్, పర్శరామ్, భాను ప్రసాద్, ప్రవీన్ కొనో కార్పస్ వృక్షాలను తొలగించాలని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో అబ్దుల్ రహమాన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.