
మెదక్ టౌన్, వెలుగు: బాల్య వివాహాలను అరికట్టి వారికి బంగారు భవిష్యత్‌ను అందించాలని కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. బుధవారం జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని డీడబ్ల్యువో బ్రహ్మాజీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కలెక్టర్ షా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆడపిల్లలను రక్షించడం, చదివించడం వల్ల సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారన్నారు.
ఆడ, మగ అనే తేడా పిలిచే పిలుపులో ఉండాలె తప్పా చూపించే ప్రేమలో ఉండకూడదన్నారు. అమ్మాయిలు ధైర్యంగా సమస్యలను ఎదుర్కొని, బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం అధికారులు, తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ చేయించారు. బేటీ బచావో- బేటీ పడావో క్యాలెండర్, కెరీర్ గైడెన్స్ పోస్టర్విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులను సన్మానించారు.
రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించిన నర్సాపూర్ఎస్సీ బాలికల హాస్టల్‌కు చెందిన మాలోత్ శ్రీలతను అభినందించి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్రమేశ్, ఏఎస్పీ మహేందర్, జిల్లా రెవెన్యూ అధికారి పద్మశ్రీ, డీఈవో రాధాకిషన్, డీఎం అండ్‌హెచ్‌వో చందూనాయక్, ఐసీడీఎస్ సీడీపీవోలు, సూపర్వైజర్లు, చైల్డ్‌లైన్ కో-ఆర్డినేటర్లు, బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులు, ఎన్జీవోల అధికారులు పాల్గొన్నారు.