నిజామాబాద్ సిటీ, వెలుగు: ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్ లైన్ లో వెంటవెంటనే నమోదు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. జక్రాన్పల్లి మండలం పడకల్ లో గురువారం జరిగిన ప్రజాపాలన, గ్రామసభను కలెక్టర్ పరిశీలించారు.
దరఖాస్తులు నింపేందుకు ప్రజలకు సహకరించాలన్నారు. ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకున్నవారు తప్పనిసరిగా రశీదు పొందాలన్నారు. దరఖాస్తులను ఎంపీడీవో ఆఫీస్ లో భద్రపరచాలని కలెక్టర్ సూచించారు. అడిషనల్కలెక్టర్ పి.యాదిరెడ్డి, నోడల్ ఆఫీసర్ తిరుమల ప్రసాద్ పాల్గొన్నారు.