- సీఎంసీ కాలేజ్ బిల్డింగ్‌లో కౌంటింగ్
- జూన్6 దాకా కోడ్ అమలు
నిజామాబాద్, వెలుగు: పార్లమెంట్ఎలక్షన్స్ కోసం జిల్లాలో 9 వేల మంది సిబ్బంది పనిచేయనున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు తెలిపారు. జూన్6 వరకు ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. కలెక్టర్ఆదివారం మీడియాతో వివరాలు వెల్లడించారు. డిచ్పల్లి లోని సీఎంసీ మెడికల్కాలేజీలో ఓట్ల కౌంటింగ్ ఉంటుందన్నారు.
బాన్సువాడ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ బాధ్యతను తానే పర్యవేక్షిస్తానన్నారు. 85 ఏండ్లు నిండిన వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటేసే వెసులుబాటు ఉందని, ఏప్రిల్22లోపు అందుకు సంబంధించిన ఫారాన్ని బీఎల్వోలకు అందజేయాలన్నారు. పోలింగ్‌శాతాన్ని పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. సీపీ కల్మేశ్వర్మాట్లాడుతూ.. ఎన్నికల కోసం జిల్లాలో మొత్తం 18 చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పొలిటికల్ పార్టీ లీడర్లు నిర్వహించే మీటింగ్‌లకు ముందస్తు పర్మిషన్లు తీసుకోవాలన్నారు. రాత్రి 10 గంటల నుంచి పొద్దున 6 దాకా లౌడ్స్పీకర్లు వాడొద్దని సూచించారు.
ALSO READ | ఆర్మూర్ మున్సిపల్ పీఠంపై ఉత్కంఠ
మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు, వాట్సాప్పోస్టులు పెట్టొద్దన్నారు. ప్రార్థనా మందిరాలకు 100 మీటర్లలోపు ప్రచారాలు చేయరాదన్నారు. అడిషనల్కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, ట్రైనీ ఐపీఎస్ చైతన్యరెడ్డి, అడిషనల్డీసీపీ కోటేశ్వరరావు ఉన్నారు. అనంతరం కలెక్టరేట్లోని 28 నెంబర్రూమ్లో మీడియా సెంటర్ ను ప్రారంభించారు.