సివిల్స్ విజేతకు కలెక్టర్ అభినందన

నిజామాబాద్, వెలుగు: ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన బోధన్ పట్టణానికి చెందిన కె.మహేశ్​ కుమార్ ను సోమవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అభినందించారు. మహేశ్​ కుటుంబ నేపథ్యం,

విద్యాభ్యాసం, సివిల్స్ కోసం సన్నద్ధమైన తీరు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. డీఎంహెచ్​వో డాక్టర్ సుదర్శనం, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు కిషన్ ఉన్నారు.