నిజామాబాద్ సిటీ, వెలుగు: ప్రజావాణిలో తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు అందజేసిన దరఖాస్తులను సంబంధిత శాఖ అధికారులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 84 మంది దరఖాస్తులు అందజేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్, అదనపు కలెక్టర్ అంకిత్, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డిని కోరారు.
కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 82 మంది తమ సమస్యలు పరిష్కరించాలని అర్జీలు అందజేశారు. కలెక్టర్ఆశిశ్సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి దరఖాస్తులు స్వీకరించారు. ఆర్జీదారులతో కలెక్టర్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరిందుకు నిర్వహిస్తున్న ప్రజావాణిపై జిల్లా ఆఫీసర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. డీఆర్డీవో సురేందర్, డీపీవో శ్రీనివాస్‌రావు, ఆయా శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు.