- జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
- నందిపేట ప్రైమరీ స్కూల్ లో పనులు పరిశీలించిన కలెక్టర్
నందిపేట, మాక్లూర్, వెలుగు : అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. మంగళవారం నందిపేట మండల కేంద్రంలోని రాజానగర్, మాక్లూరు మండలంలోని ముల్లంగి (బి), బొంకన్ పల్లి గ్రామాల్లోని ప్రైమరీ స్కూళ్లను ఆయన సందర్శించారు. పాఠశాలలో జరుగుతున్న వంటగది, అదనపు గదులు, వాటర్‌పంప్, టాయిలెట్స్తదితర మరమ్మతు పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మిషన్‌భగీరథ నీరు వస్తుందా.. సర్వే బృందాలు వివరాలు సేకరించారా అని ఆరా తీశారు. పెండింగ్‌పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఎక్కడా నాణ్యతా లోపం ఉండకుండా చూడాలన్నారు. కాలనీ వాసులు రోడ్డు బాగోలేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఉపాధిహామీ కింద రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట నందిపేట మండల ప్రత్యేక అధికారి జగన్నాథా చారి, పీఆర్‌ఈఈ భావన్న, తహసీల్దార్ ఆనంద్‌కుమార్, ఎంపీడీఓ శ్రీనివాస్‌రావ్ మాక్లూరు స్పెషలాఫీసర్ ముత్తెన్న, ఎంపీడీవో క్రాంతి, పీఆర్ ఏఈ శ్రీనివాస్, గ్రామస్థులు తదితరులున్నారు.