పోలింగ్ సెంటర్లు వేర్వేరుగా ఏర్పాటు చేయాలి : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

పోలింగ్ సెంటర్లు వేర్వేరుగా ఏర్పాటు చేయాలి :  కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

రెంజల్​/నిజామాబాద్, వెలుగు:  ఎమ్మెల్సీ ఎలక్షన్‌‌‌‌లో ఓటు వేసే గ్రాడ్యుయేట్లు, టీచర్ల కోసం పోలింగ్​సెంటర్లు వేరుగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. శుక్రవారం ఆయన రెంజల్​గవర్నమెంట్​హై స్కూల్‌‌‌‌లో ఏర్పాటు చేసిన సెంటర్ విజిట్ చేశారు. ఎలక్షన్​కమిషన్​ గైడ్​లైన్స్​ ప్రకారం పోలింగ్​ సెంటర్ల వద్ద వసతులు కల్పించాలన్నారు.  కరెంట్‌‌‌‌, నీటి సరఫరా, టాయిలెట్స్, ర్యాంపు ఉండేలా చూడాలన్నారు.  మన ఊరు -మన బడిలో భాగంగా నిర్మించిన కొత్త క్లాస్​ రూమ్​లను కలెక్టర్​ పరిశీలించారు.

సర్కారు హాస్టళ్లకు పాత బియ్యం  

కొత్త బియ్యంతో తయారు చేసిన అన్నం మెత్త సుద్దలా ఉంటోందని సర్కారు హాస్టళ్లన్నింటికీ పాతబియ్యం సరఫరా చేయాలని కలెక్టర్​ రాజీవ్‌‌‌‌గాంధీ హనుమంతు సివిల్‌‌‌‌ సప్లై డీఎం​ అంబాదాస్‌‌‌‌ను ఆదేశించారు. శుక్రవారం రెంజల్‌‌‌‌లోని  మైనారిటీ రెసిడెన్షియల్​ స్కూల్‌‌‌‌ను ఆయన విజిట్ చేశారు.  ఫ్రెష్​ కూరగాయలతో వంటలు చేయాలని, ఈగలు, దోమల రాకుండా పరిసరాలు నీట్‌‌‌‌గా ఉంచాలని వార్డెన్ ప్రిన్సిపాల్ అర్షియా నజమ్‌‌‌‌కు సూచించారు. మెనూ ప్రకారం స్టూడెంట్స్‌‌‌‌కు డైట్ అందేలా చూడాలన్నారు. ఇన్‌‌‌‌చార్జి తహసీల్దార్​ శ్రావణ్​ తదితరులు ఉన్నారు.