![ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై ట్రైనింగ్ : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు](https://static.v6velugu.com/uploads/2025/02/collector-rajiv-gandhi-hanumanthu-advised-officials-to-conduct-the-mlc-elections-with-awareness_u1SBAWlOk0.jpg)
నిజామాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికలను అవగాహనతో నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. శనివారం ఆయన అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పీవో, ఏపీవోల మొదటి విడత ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏమైనా అనుమానాలు ఉంటే మాస్టర్ ట్రైనర్లతో నివృత్తి చేసుకోవాలన్నారు. 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించాలన్నారు.
ఆ టైంలోపు సెంటర్‌కు చేరిన ఓటర్లను క్యూలో నిలబెట్టి టోకెన్ నంబర్లు ఇవ్వాలన్నారు. 26న ఉదయం 8 గంటలకు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకోవాలని పోలింగ్ సెంటర్లలోకి సెల్ఫోన్లకు అనుమతి లేదన్నారు. పోలింగ్తర్వాత బ్యాలెట్బాక్స్ లను కరీంనగర్‌లోని కౌంటింగ్సెంటర్ రిసిప్షన్ పాయింట్లో అందించే బాధ్యత పీవోలదేనన్నారు. రికార్డు బుక్‌లో వివరాలు పక్కాగా ఎంటర్ చేయాలన్నారు. మాస్టర్ ట్రైనర్స్ హన్మాండ్లు, వర్మ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో సిబ్బందికి అవగాహన కల్పించారు. నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, తహసీల్దార్లు పాల్గొన్నారు.