![పంచాయతీ ఎలక్షన్‌కు రెడీ కావాలి : కలెక్టర్ రాజీవ్‌గాంధీ](https://static.v6velugu.com/uploads/2025/02/collector-rajiv-gandhi-hanumanthu-advised-officials-to-prepare-for-conduct-of-gram-panchayat-elections_DdaPyKucUp.jpg)
ఆర్మూర్/బోధన్/నిజామాబాద్/వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సోమవారం నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ల ఫస్ట్ ఫేజ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి సీఈసీ జారీ చేసిన ఆర్డర్స్ పాటించాలన్నారు. ముందుగా ఎలక్షన్ పట్ల పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలని, రూల్స్‌ను తప్పకుండా పాటించాలన్నారు. మొత్తం ప్రక్రియలో ఆర్వోల రోల్అత్యంత ప్రాధాన్యమైనదన్నారు.
నామినేషన్ల స్వీకరణ, స్ర్కూట్నీ, విత్‌డ్రా పట్ల జాగత్రగా ఉండాలని, సమయపాలన పక్కాగా పాటించడానికి గోడ గడియారాలు విధిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. లోకల్ఓటర్లే అభ్యర్థులను ప్రతిపాదించాలని, అభ్యర్థుల తరపున నామినేషన్లు విత్‌డ్రా చేయడానికి ప్రతిపాదకులు వస్తే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వీడియో తీయించాలన్నారు. నామినేషన్ ప్రక్రియ సక్సెస్‌ఫుల్‌గా ముగిస్తే ఎలక్షన్, కౌంటింగ్ సజావుగా ముగించడానికి వీలుంటుందన్నారు. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్జారీ అయ్యాక డైలీ రిపోర్టును పంపాలని, అభ్యర్థుల నామినేషన్ పేపర్స్‌ను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నారు. ఒక అభ్యర్థి ఎన్ని సెట్ల నామినేషన్లు దాఖలు చేసినా అన్నింటినీ పరిశీలించాలని, తిరస్కరించిన వాటికి కారణాలు స్పష్టంగా రాయాలని చెప్పారు.
బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్లను తెలుగు అక్షరమాల ఆధారంగా ప్రింట్చేయించాలని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ కోసం అనువైన బిల్డింగ్‌ను ముందే గుర్తించి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీపీవో శ్రీనివాస్, బోధన్ సబ్ కలెక్టర్వికాస్మహతో, ఆర్డీవో రాజేంద్రకుమార్, డీఈవో అశోక్, డీఎల్పీవోలు తదితరులు పాల్గొన్నారు.