![సర్కారు వైద్యంపై నమ్మకాన్ని పెంచాలి : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు](https://static.v6velugu.com/uploads/2025/02/collector-rajiv-gandhi-hanumanthu-inspected-the-balkonda-community-health-center_hm58JfAHg4.jpg)
- జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
- బాల్కొండ సీహెచ్ సీ,మైనార్టీ స్కూల్ తనిఖీ
బాల్కొండ, వెలుగు : అంకితభావంతో ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తూ గవర్నమెంట్ ఆసుపత్రుల పట్ల నమ్మకం కలిగించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సిబ్బందికి సూచించారు. మంగళవారం బాల్కొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్, ఇన్ పేషేంట్, జనరల్ వార్డులు, ల్యాబ్ ను పరిశీలించి, అందుబాటులో ఉన్న డాక్టర్లు, స్టాఫ్ గురించి ఆరా తీశారు.
ప్రతి రోజు వచ్చే పేషంట్ల సంఖ్య, డెలివరీల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైన నార్మల్ డెలివరీలు అయ్యేలా కృషి చేయాలని సూచించారు. గవర్నమెంట్ హాస్పిటళ్లపై నమ్మకం కలిగేలా పని చేయాలని హితవు పలికారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండే. విధంగా చూసుకోవాలన్నారు.అనంతరం మండల కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ను కలెక్టర్ తనిఖీ చేశారు.
స్కూల్ లోని కిచెన్, డైనింగ్ హాల్ లో సౌకర్యాలు పరిశీలించారు. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజా గౌడ్,డా.శ్రుతి,స్థానిక మండల ఆఫీసర్లు,వైద్య సిబ్బంది ఉన్నారు.
నిబంధనల మేరకు విధులు నిర్వర్తించాలి
ఆర్మూర్, వెలుగు : గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ నియమ, నిబంధనల మేరకు విధులు నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రిటర్నింగ్(ఆర్వో), అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు(ఎఆర్వో) సొంత నిర్ణయాలను తీసుకోరాదని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఆర్మూర్ మండలం చేపూర్ శివారులోని క్షత్రియ ఇంజినీరింగ్ కాలేజ్ లో మంగళవారం ఆర్వో, ఎఆర్వోలకు పంచాయతీ ఎన్నికల మొదటి దశ నిర్వహణ పై శిక్షణ తరగతులు నిర్వహించారు. కలెక్టర్ హాజరై మాట్లాడుతూ..
శిక్షణ తరగతుల్లో సూచించే అంశాలను శ్రద్ధగా వినాలన్నారు. ఎలాంటి సందేహాలు ఉన్నా అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. బ్యాలెట్ పేపర్ లో అభ్యర్థుల పేర్లను అక్షర క్రమంలో ముద్రించాల్సి ఉంటుందని అన్నారు. ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రాజు, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, డీఎల్పీవో ఏ.శివకృష్ణ, ఆర్వోలు, ఎఆర్వోలు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీవోలు పాల్గొన్నారు.