అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలి : రాజీవ్​గాంధీ హన్మంతు

అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలి  : రాజీవ్​గాంధీ హన్మంతు
  • కలెక్టర్​ రాజీవ్​గాంధీ హన్మంతు 

(జక్రాన్​పల్లి)నిజామాబాద్, వెలుగు:  ప్రభుత్వ హస్పిటల్స్​లో అన్ని రకాల ట్రీట్​మెంట్​ వసతులున్నాయని,  రోగుల నమ్మకం పెంచేలా సర్వీస్​ అందించాలని కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు సూచించారు.  శుక్రవారం జక్రాన్​పల్లి పీహెచ్​సీని ఆకస్మికంగా తనిఖీ చేసి  రోగులతో మాట్లాడారు.  డాక్టర్లు, స్టాఫ్​ టైంకు వస్తున్నారా అని ఆరా తీశారు.  సీబీపీ మెషిన్​ను రెగ్యూలర్​గా వాడాలని అన్ని రకాల మెడిసిన్స్​ను అందుబాటులో ఉంచుకోవాలని కాలం చెల్లిన మెడిసిన్స్​ను ఎప్పటికప్పుడు చెక్​ చేసి వాటి స్థానంలో కొత్త మందులు తెప్పించుకోవాలన్నారు.  

ఇన్​పేషెంట్​ వార్డు, ల్యాబ్​, వాక్సినేషన్​ రూమ్​ డ్రగ్​ స్టోర్​ను పరిశీలించారు.  డిచ్​పల్లి మండలం సుద్దపల్లి సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ స్కూల్​ను తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్​గాంధీ  కిచెన్​, డార్మెటరీ, డైనింగ్​ సెక్షన్​లు పరిశీలించారు. పిల్లలకు వడ్డించడానికి రెడీ చేసిన వంటల నాణ్యతను చెక్​ చేశారు. రైస్​, కూరగాయలను ఇష్టమొచ్చిన రీతిలో ఎందుకు పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని  పెట్టాలన్నారు. సుద్దులం జడ్పీ స్కూల్​విజిట్​ చేసిన మధ్యలో ఆగిపోయిన ఇంకుడుగుంత  పనులు పూర్తి చేయాలని పీఆర్​ ఇంజినీర్లను ఆదేశించారు.  టెన్త్​ రిజల్టు వంద శాతం వచ్చేలా టీచర్లు కృషి చేయాలన్నారు.