ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టండి : రాజీవ్ గాంధీ హనుమంతు

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టండి   : రాజీవ్ గాంధీ హనుమంతు
  • ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు 

ఎడపల్లి,  వెలుగు :  మండలంలో పైలట్​ ప్రాజెక్టుగా ఎంపికైన జైతాపూర్​ గ్రామంలో  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం పరిశీలించి మాట్లాడారు. అర్హులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను చేపట్టి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. గ్రామంలో కుటుంబాలు ఎన్ని ?  ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని మంజూరయ్యాయి అని అధికారులను ప్రశ్నించారు. 125 మందికి ఇండ్లు మంజూరు కాగా, 25 ఇండ్ల నిర్మాణ పనులు సాగుతున్నాయన్నారు. మిగతావాటిని త్వరగా ప్రారంభించాలని అధికారులకు కలెక్టర్​ సూచించారు. 

 అనంతరం ఎడపల్లి లోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను కలెక్టర్​తనిఖీ చేశారు.  కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూం లను పరిశీలించి, విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలన్నారు.  కలెక్టర్ వెంట గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సత్యనారాయణ, ఎడపల్లి తహసీల్దార్​ దన్వాల్​, ఎంపీడీవో శంకర్​,  గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గంగాశంకర్ తదితరులు ఉన్నారు.