
- మొత్తం ఓట్లు 255, పోలైనవి 195
నిజామాబాద్, వెలుగు : టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను మంగళవారం కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు పరిశీలించారు. కలెక్టరేట్ లోని ఎన్ఐసీ హాల్లో రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ పొందిన ఉద్యోగులు ఓటు వేసి సీల్ చేసిన బాక్స్‌లో కవర్ వేశారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగింది.
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ విధుల్లో పాల్గొనే టీచర్లు, గ్రాడ్యుయేట్లు మొత్తం 255 మందికి పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వగా, 195 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ డ్యూటీ వేసిన లెటర్, ఐడీ కార్డును పరిశీలించాక ఓటు వేసేందుకు అనుమతించారు. పోలీస్ బందోబస్తు మధ్య ఓటింగ్ జరుగగా, బాక్స్‌లను కరీంనగర్ కౌంటింగ్ సెంటర్‌కు తరలించారు.