ల్యాబ్ నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రతిపాదనలు పంపండి : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

ల్యాబ్ నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రతిపాదనలు పంపండి : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
  • పోచంపాడ్ హాస్టల్, పీహెచ్ సీని తనిఖీ చేసిన కలెక్టర్​

బాల్కొండ, వెలుగు : అర్ధాంతరంగా నిలిచిన ల్యాబ్ గదుల నిర్మాణాలను పూర్తి చేసేందుకు   ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్కూల్​ హెచ్​ఎంను ఆదేశించారు. మంగళవారం మెండోరా మండలం పోచంపాడ్ స్కూల్​, పీహెచ్​సీ సెంటర్ ను కలెక్టర్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్ లోని కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్, డార్మెటరీ రూమ్ ను సందర్శించి బియ్యం, కూరగాయలు, వంట నూనె నాణ్యతను పరిశీలించారు.  సరుకుల స్టాక్ రిజిస్టర్​ను చూశారు. 

కిచెన్ లో నిరుపయోగంగా ఉన్న స్టీమ్ యూనిట్ ను వినియోగంలోకి తేవాలన్నారు. అనంతరం దవాఖానను సందర్శించి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు.  మధుమేహం, టైపాయిడ్, మలేరియా వంటి వ్యాధుల నిర్ధారణ, అందిస్తున్న చికిత్సల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.  కలెక్టర్​ వెంట సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఇన్​చార్జి, జోనల్ ఆఫీసర్ పూర్ణచందర్, ప్రిన్సిపాల్ గోదావరి, మెడికల్ ఆఫీసర్ రాకేష్, ఎమ్మార్వో సంతోష్ రెడ్డి, ఎంపీడీవో వనజ తదితరులు ఉన్నారు.