
- ప్రభుత్వ భూమి కబ్జాలపై చర్యలు తీసుకోండి
- కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు
నిజామాబాద్, వెలుగు : ప్రభుత్వ భుముల కబ్జాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు తహసీల్దార్లను ఆదేశించారు. మంగళవారం ప్రభుత్వ రెసిడెన్సియల్ స్కూల్, హాస్టల్ నిర్మాణాలకు స్థలాలను ఆయన పరిశీలించారు. అవసరమైన స్థలాన్ని గుర్తించి నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు.
నగర శివారులోని గుండారం, నాగారం ఏరియాలో భూములు కబ్జా అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాలను వెంటనే తొలగించాలని తహసీల్దార్ బాలరాజును ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రాజేంద్రకుమార్ తదితరులు ఉన్నారు.