నిజామాబాద్, వెలుగు : కొత్తగా ఓటర్ నమోదు అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తన ఛాంబర్లో పొలిటికల్ పార్టీల లీడర్లతో మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. 2014, జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన వారు ఓటర్‌గా నమోదు చేసుకోవచ్చన్నారు. లిస్టు మార్పుచేర్పులకు అవకాశం ఉందన్నారు.
మరణించిన వారి పేర్లు తొలగించాలని, డబుల్ఓట్లను గుర్తించాలన్నారు. మూడు కిలోమీటర్లు దాటి పోలింగ్‌కేంద్రాలు ఉంటే తెలుపాలన్నారు. జనవరి 22న డ్రాఫ్ట్లిస్టును విడుదల చేస్తామని, ఫిబ్రవరి 8న ఫైనల్లిస్టు ప్రకటిస్తామన్నారు. అడిషనల్ కలెక్టర్ యాదిరెడ్డి తదితరులు ఉన్నారు.
టెన్త్స్టూడెంట్స్ సన్నద్ధతపై దృష్టి పెట్టాలి
టెన్త్ పరీక్షలు దగ్గరపడుతున్న వేళ టీచర్లందరూ స్టూడెంట్స్ సన్నద్ధతపై దృష్టి సారించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లో నిర్వహించిన మీటింగ్‌లో మాట్లాడారు. ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో వెనుకబడిన వారికి స్పెషల్‌క్లాసులు తీసుకోవాలన్నారు. డీఈవో దుర్గాప్రసాద్, జీసీడీవో వనిత, ఏసీఈ విజయభాస్కర్, ఎంఈవోలు, నోడల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.