మద్యం అమ్మకాలపై నజర్​

  •     వైన్స్​షాపుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు
  •     కలెక్టర్​ రాజీవ్​గాంధీ హన్మంతు

నిజామాబాద్, వెలుగు: ఎన్నికల వేళ జిల్లాలో రూ.83.84 లక్షల విలువైన అక్రమ మద్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నట్లు కలెక్టర్ రాజీవ్​ గాంధీ హన్మంతు తెలిపారు. 102 వైన్స్​షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అమ్మకాలను పర్యవేక్షిస్తున్నామన్నారు. కేంద్రం ఎన్నికల సంఘం తరఫున శనివారం జిల్లాకు వచ్చని ఎన్నికల వ్యయ పరిశీలకుల కోసం నోడల్​ ఆఫీసర్లతో నిర్వహించిన మీటింగ్ లో కలెక్టర్​ మాట్లాడారు. ఎన్నికల నిబంధనల అమలు తీరును పవర్​పాయింట్​ ​ ద్వారా పరిశీలకులకు తెలిపారు. 

మొత్తం 36 మండలాల్లో 1549 పోలింగ్​కేంద్రాలు ఏర్పాటు చేశామని, పార్టీల వారిగా ప్రచార ఖర్చుల పర్యవేక్షణకు గ్రౌండ్​ లెవల్​ టీమ్​లను నియమించామన్నారు. డబ్బుల పంపిణీ లేదా ఓటర్లను ప్రభావితం చేసే చర్యలకు సంబంధించి 1950 టోల్​ఫ్రీ నెంబర్​కు ఫిర్యాదులు వచ్చిన వెంటనే ఎఫ్ఎస్ టీ, ఎస్ఎస్​టీ బృందాలను పంపుతున్నామన్నారు. ఈ రెండు టీమ్​ల వాహనాలకు అధునాతన కెమెరాలు పెట్టి, కంట్రోల్​ రూమ్​నుంచి సూపర్​ వైజ్​​ చేస్తున్నామన్నారు. ఎంపిక చేసిన నాలుగు అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్​పోస్టుల్లోనూ సీసీ కెమెరాలు పెట్టించామన్నారు.

వ్యయ పరిశీలకులు..

కేంద్ర ఎన్నికల సంఘం తరఫున జిల్లాకు నియమితులైన వ్యయ పరిశీలకుల వివరాలను కలెక్టర్​ రాజీవ్​గాంధీ హన్మంతు తెలిపారు. నిజామాబాద్ ​అర్బన్, రూరల్​ సెగ్మెంట్లకు అబ్జర్వర్​గా పాటిల్​ చిన్మయ్​ప్రభాకర్​(సెల్​8332021903) , బాల్కొండ, ఆర్మూర్​నియోజకవర్గాల పరిశీలకురాలిగా ఎ.శక్తి (సెల్​8332021809), బోధన్​కు తాన్యాసింగ్​(సెల్​8332021892) వ్యవహరిస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు పౌరులకు అందుబాటులో ఉంటారని, నేరుగా కలువొచ్చన్నారు.