నిజామాబాద్, వెలుగు : జిల్లాలోని 396 మత్స్యకార పారిశ్రామిక సంఘంలో సభ్యులుగా ఉన్న 24 వేల మంది ఉపాధి కోసం ప్రభుత్వం వందశాతం సబ్సిడీపై 2.27 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేస్తోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిషరీస్ డిపార్ట్మెంట్ఆఫీసర్లు విడతలవారీగా చేప పిల్లలను చెరువుల్లో వదులుతారని వివరించారు.
35 నుంచి 40 ఎంఎం సైజులో కోటీ 35 లక్షల చేపపిల్లలు, 80 నుంచి 100 ఎంఎం సైజులో 91 లక్షల పిల్లలు ఉన్నాయని తెలిపారు. సోమవారం నుంచి చెరువుల్లో చేపపిల్లలను వదలడానికి ఆఫీసర్లు వస్తున్నందున సీడ్ చేపల సైజ్‌ను స్కేల్‌తో కన్ఫర్మ్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఎవరికైనా అనుమానాలుంటే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు.