నిజామాబాద్/డిచ్పల్లి, వెలుగు: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మిన రైతులు పేమెంట్ కోసం ఎదురుచూసే పరిస్థితి ఎక్కడా తలెత్తడానికి వీలులేదని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అన్నారు. గురువారం ఆయన డిచ్పల్లి మండలం రాంపూర్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. ధాన్యాన్ని రైస్‌మిల్స్‌కు తరలించిన తరువాత ట్రక్‌షీట్స్ తెప్పించుకొని ట్యాబ్ఎంట్రీలు పూర్తి చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు ముగిసిన 48 గంటలలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమకావాలన్నారు. రైస్ మిల్లుల వద్ద తరుగు విధించడానికి వీలులేదన్నారు.
మెనూ ప్రకారమే స్టూడెంట్స్‌కు భోజనం
సర్కారు నిర్దేశించిన విధంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ఆదేశించారు. రాంపూర్‌లోని జ్యోతిబాపూలే బీసీ బాయ్స్గురుకులం పాఠశాలను సందర్శించారు. స్టోర్‌రూంలోని బియ్యం, సరుకులు, కిచెన్, డైనింగ్పరిశీలించారు. వడ్డించడానికి ముందే భోజనాన్ని పరిశీలించాలన్నారు. ఎలాంటి సమస్యలున్నా తహసీల్దార్ దృష్టికి వెంటనే తీసుకురావాలని సూచించారు.