మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి అన్ని ఏర్పాటు చేయాల ని ఆఫీసర్లను కలెక్టర్, ఎన్నికల అధికారి రవి నాయక్ ఆదేశించారు. మంగళవారం ఆయన తన క్యాంపు ఆఫీసులో పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి, సంబంధిత ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల విధులు చేసే ఉద్యోగులు, అత్యవసర శాఖలలో పనిచేస్తున్న వారు పోస్టల్ బ్యాలెట్ కోసం ఈ నెల 10 లోగా ఫారం డి -12ను సమర్పించాల్సి ఉంటుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ఒక నోడల్ అధికారిని నియమించామన్నారు. కార్యక్రమంలో డీఆర్వో రవి కుమార్,మైనార్టీ సంక్షేమ అధికారి రవీంద్రనాథ్ , డీఈవో రవీందర్ ,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
స్పీడ్‌గా పనిచేయాలి
ఎఫ్ఎస్ టీ, ఎస్ఎస్ టీ, వీఎస్ టీ టీంలతో పాటు సి విజిల్ టీంలు ఇంకా స్పీడ్‌గా పనిచేయాలని కలెక్టర్ రవినాయక్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో బృందాలతో ఎన్నికల నియమావళి అమలు తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విధులకు గైర్హాజరు కావద్దని, వారికి బదులుగా ఇంకొకరిని విధుల్లో ఉంచకూడదని ఆదేశించారు. కార్యక్ర మంలో డీఎఫ్ ఓ సత్యనారాయణ , గిరిజన సంక్షేమ అధికారి చత్రు నాయక్, పాల్గొన్నారు.