జిల్లాలో  రూ. 953 కోట్ల రుణ మాఫీ: కలెక్టర్ రవినాయక్  

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలో లక్షా 25వేల మంది రైతులకు రూ.  953 కోట్ల మేర పంట రుణాలు మాఫీ కానున్నాయని కలె క్టర్ రవినాయక్ తెలిపారు. బుధవారం తన క్యాంపు ఆఫీసు నుంచి బ్యాంకు, అగ్రికల్చర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు.  జిల్లాలో 55,250 మంది రైతులకు రూ.297 కోట్లు రుణ మాఫీ అయ్యిందని, వారి   ఖాతాలలో డబ్బులు జమైనట్లు వెల్లడించారు. మిగతా రైతుల రుణ మాఫీ పురోగతిలో  ఉందన్నారు.

ALSO READ:వేములవాడ రాజన్న ఆలయంలోని దర్గాకు తాళం..

 ఎవరికైనా  రుణ మాఫీ , కొత్త రుణాల మంజూరు తదితర అంశాలపై  అనుమానాలుంటే  కంట్రోల్ రూం నెంబర్ 08542 241165 కాల్ చేసి తెలుకోవాలన్నారు. 8వేల మంది రైతులకు సంబంధించి రూ. 57 కోట్లు రుణ మాఫీ బిల్లులను సమర్పించామని, మరో 33,433 మంది రైతుల రుణ మాఫీ ప్రాసెస్ లో ఉందన్నారు. 928 మంది రైతులు బ్యాంకు ఖాతాలు క్లోజ్ చేసుకున్నందున వారికి సంబంధించిన ఇతర బ్యాంకు ఖాతాల వివరాలను ఏఈఓలు, అగ్రికల్చర్ అధికారులు తక్షణమే సేకరించి పంపించాలని ఆదేశించారు. రైతులందరికీ  25 నాటికి తప్పనిసరిగా రుణాలను రెన్యూవల్ చేసి పంట రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఏవో వెంకటేశ్, ఎల్డీఎం భాస్కర్,   తదితరులు పాల్గొన్నారు. 

ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వహించాలి

సెక్టోరల్ అధికారులు ఎన్నికల విధులను జాగ్ర త్తగా నిర్వహించాలని కలెక్టర్ రవినాయక్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో ఎన్నికల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు కేంద్ర,రాష్ర్ట ఎన్నికల సంఘం జారీ చేసిన సూచనలను పాటించాలన్నారు. సెక్టోరల్ అధికారులకు ఎన్నికల సమయంలో మెజిస్ట్రీయల్ పవర్స్ ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్పీ నరసింహ, అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు, స్పెషల్ కలెక్టర్ నటరాజ్ పాల్గొన్నారు. 

మహబూబ్ నగర్ టౌన్,వెలుగు: రాబోయే ఎన్నికల్లో నిబంధనల మేరకు పోలీసు అధికారులు విధులు నిర్వహించాలని ఎస్పీ నరసింహ సూచించారు. బుధవారం ఎస్పీ ఆఫీసులో ఎన్నికల నిబంధనలు, భద్రతపై జరిగిన శిక్షణ కార్యక్రమంలో అధికారులనుద్దేశించి మాట్లాడారు.  సమస్యాత్మక గ్రామాలపై దృష్టి పెట్టాలన్నారు.   కార్యక్రమంలో ఏఎస్పీ రాములు,   సిబ్బంది పాల్గొన్నారు.