రంజాన్ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

రంజాన్ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
  • ముస్లిం మత పెద్దలతో  కలెక్టర్ సమీక్షా సమావేశం 

 నస్పూర్, వెలుగు: జిల్లాలో రంజాన్ పండుగను ప్రజలు శాంతియుత వాతావరణంలో సామరస్యంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో  జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీఓలు శ్రీనివాసరావు, హరికృష్ణ, మంచిర్యాల, జైపూర్ ఏసీపీ ప్రకాశ్, వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి హరీశ్ రాజ్, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌‌ రావులతో  కలిసి మండలాల తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ముస్లిం మత పెద్దలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..  పండుగలను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని, రంజాన్ మాసం, ఈద్-ఉల్-ఫితర్ పండుగ నిర్వహణ కోసం సంబంధిత శాఖల సమన్వయంతో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని తెలిపారు.  కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.