భూగర్భ జలాల పరిరక్షణ అందరి బాధ్యత : కలెక్టర్​ రిజ్వాన్​బాషా షేక్​

భూగర్భ జలాల పరిరక్షణ అందరి బాధ్యత : కలెక్టర్​ రిజ్వాన్​బాషా షేక్​

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: భూగర్భ జలాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని కలెక్టర్​ రిజ్వాన్​బాషా షేక్​ చెప్పారు. జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​ మండలం తాటికొండలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన అమలులో భాగంగా స్థానిక పాత బస్​స్టాండ్​నుంచి రైతువేదిక వరకు సోమవారం వాటర్​షెడ్​ర్యాలీ ఏర్పాటు చేయగా, కలెక్టర్​ ప్రారంభించారు. 

కలెక్టర్​ మాట్లాడుతూ సించాయీ యోజన కింద రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 35 ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 248 గ్రామాలు ఎంపికకాగా, అందులో జనగామ జిల్లా నుంచి తాటికొండ గ్రామం ఎంపికైందని తెలిపారు. భూమిలోకి ఇంకగా మిగిలిన వర్షపు నీటిని నిల్వ చేసేందుకుగాను చెక్​డ్యామ్స్​, రాతి డ్యామ్స్, ఊటకుంటలు నిర్మిస్తారని అన్నారు.