జనగామ జిల్లాలో ఫర్టిలైజర్​ దుకాణాలు తనిఖీ చేసిన కలెక్టర్

జనగామ జిల్లాలో ఫర్టిలైజర్​ దుకాణాలు తనిఖీ చేసిన కలెక్టర్

జనగామ, వెలుగు : జనగామ జిల్లా కేంద్రంలోని ఫర్టిలైజర్​దుకాణాలను కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్​సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కావేరీ, సాయిరాం ఫర్టిలైజర్స్, జేకేఎస్​ అగ్రిమాల్​లో ఎరువుల నిల్వలను, రిజిస్టర్లను పరిశీలించారు. సాయిరాం ఫర్టిలైజర్​ దుకాణంలో స్టాక్​ డిస్​ప్లే లేకపోవడం పై కలెక్టర్​ ఆగ్రహం వ్యక్తం చేస్తూ జరిమానా విధించాలని జిల్లా అగ్రికల్చర్​ ఆఫీసర్​రామారావును ఆదేశించారు.

అంతకుముందు కలెక్టరేట్​లో పీవోలు, ఏపీవోలు, ఓపీవోలు, తహసీల్దార్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్​ అడిషనల్​ కలెక్టర్​ రోహిత్​సింగ్​తో కలిసి హాజరయ్యారు. టీచర్స్​ ఎమ్మెల్సీ ఎలక్షన్లను సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు. పోలింగ్​ టైంలో, ఆ తర్వాత నిర్వహించాల్సిన విధులపై పవర్​ పాయింట్​ప్రజంటేషన్​ ద్వారా శిక్షణ ఇచ్చారు. అనంతరం తహసీల్దార్లతో నిర్వహించిన రివ్యూలో కలెక్టర్​ రిజ్వాన్​ మాట్లాడుతూ ధరణి పెండింగ్​ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. 

కలెక్టర్​కు ఆహ్వానం

జనగామ/పాలకుర్తి: మహా శివరాత్రి సందర్భంగా పాలకుర్తి సోమేశ్వరాలయంలో ఈనెల 26న నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కలెక్టర్​రిజ్వాన్​ బాషా షేక్ ను ఆలయ ఈవో మోహన్​బాబు, అర్చకులు డీవీఎస్​ శర్మ, సూపరింటెండెంట్​వెంకటయ్య ఆహ్వానించారు. నేటి నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభం కానున్నాయని వారు తెలిపారు. అంతకుముందు వచ్చే నెల 6 నుంచి 14 వరకు నిర్వహించనున్న చిల్పూరు బుగులు వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల వాల్​పోస్టర్​ను కలెక్టర్ ఈవో లక్ష్మీ ప్రసన్న, అధికారులతో కలిసి ఆవిష్కరించారు.