డాక్టర్లు నిత్యం అందుబాటులో ఉండాలి : కలెక్టర్​ రిజ్వాన్ ​బాషా షేక్

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: ప్రభుత్వం ప్రజారోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో  డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉండాలని కలెక్టర్​ రిజ్వాన్ ​బాషా షేక్​ఆదేశించారు. జనగామ జిల్లా స్టేషన్​ ఘన్​పూర్​క్లస్టర్​హస్పిటల్​(సామాజిక ఆరోగ్య కేంద్రం)ను శుక్రవారం కలెక్టర్ ​తనిఖీ చేశారు. ఓపీ వార్డు, ఐపీ వార్డు, ఏఎన్సీ క్లినిక్​లను తనిఖీ చేశారు. డాక్టర్లు, సిబ్బంది అటెండెన్స్​ రిజిస్టర్​ను పరిశీలిం చారు.

హాస్పిటల్​లో అందుతున్న వైద్య సేవలపై పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. ఓపీ సేవలను మెరుగైన రీతిలో అందించాలని సూచించారు. అనంతరం స్టేషన్​ఘన్​పూర్​ మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు, స్టేషన్​ ఘన్​పూర్​ గ్రామాలల్లో రేషన్​ కార్డుల జారీ కోసం ప్రభుత్వం నిర్వహిస్తోన్న సర్వేను పరిశీలించారు. ఆర్డీవో వెంకన్న, ఎంపీడీవో విజయశ్రీ, తహసీల్దార్​ వెంకటేశ్వర్లు, మెడికల్​ సూపరిటెండెంట్​ డాక్టర్ సంధ్యరాణి, మెడికల్​ ఆఫీసర్​జనార్దన్, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు