ట్రాన్స్​ జెండర్లు క్లినిక్​ ను ఉపయోగించుకోవాలి :కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్

జనగామ అర్బన్, వెలుగు :  మైత్రి ట్రాన్స్​ క్లినిక్​ ను ట్రాన్స్​ జెండర్లు  ఉపయోగించుకోవాలని  కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం  ట్రాన్స్​ జెండర్ల కోసం  అన్ని జిల్లాల్లో మైత్రి  క్లినిక్​లను   ప్రారంభించినట్టు తెలిపారు.   జిల్లా లోని ప్రభుత్వ జనరల్​ హస్పిటల్​లో ఏర్పాటు చేసిన మైత్రి ట్రాన్స్​ క్లినిక్​ ను కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్​ గురువారం ప్రారంభించారు.   ఉన్న ట్రాన్స్​ జెండర్లకు  ఏమైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే  క్లినిక్​ కు రావాలని చెప్పారు.  కార్యక్రమంలో డీడబ్ల్యూవో డి. ఫ్లోరెన్స్​, డిప్యూటీ డీఎంహెచ్​వో రవీందర్​, సీడీపీవో రమాదేవి పాల్గొన్నారు.