జనగామ/ స్టేషన్‌ఘన్‌పూర్/ పాలకుర్తి, వెలుగు : రోడ్డు పునరుద్ధరణ పనులు వెంటనే చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సోమవారం జిల్లాలో వరదలకు కొట్టుకు పోయిన రోడ్ల పరిస్థితిని పరిశీలించారు. మరమ్మతులు చేపట్టి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. తదుపరి పాలకుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్నిఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు.
పాలకుర్తి కేజీబీవీ వసతి గృహం, సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల, గూడూరు ట్రైబల్వెల్ఫేర్వసతి గృహాన్ని పరిశీలించారు. పాలకుర్తి పాఠశాలలో కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. స్టేషన్ ఘనపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ఆర్డీవో డీఎస్ వెంకన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అక్కడ ఆర్డీవో ఓపీ గదిలోకి వెళ్లి చూడగా డాక్టర్లు అందుబాటులో లేరు.
బయట పేషెంట్లు వేచి ఉండడంతో కలెక్టర్ఆగ్రహం వ్యక్తం చేశారు. సీహెచ్‌సీలోని విధుల్లో లేని మొత్తం ఆరుగురు డాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. ఆస్పత్రిలో డ్యూటీలకు రాకుండా నిర్లక్ష్యం చేస్తే వెంటనే సస్పెండ్ చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా డీఎంహెచ్‌వో రవీందర్‌గౌడ్‌ను ఆదేశించారు. పాలకుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక కస్తూర్బా, రెసిడెన్షియల్ బాలికల హాస్టల్‌ను పరిశీలించారు.