![ఆహార భద్రత పాటించకపోతే చర్యలు తప్పవు : కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్](https://static.v6velugu.com/uploads/2025/02/collector-rizwan-basha-sheikh-clarified-that-safe-food-should-be-provided-to-people_HDcykWNerB.jpg)
జనగామ అర్బన్, వెలుగు: ఆహార భద్రత పాటించకపోతే చర్యలు చర్యలు తప్పవని, నిబంధనలకు అనుగుణంగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ప్రజలకు సురక్షితమైన ఆహారాన్ని అందించాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ లో ఆహార పరిరక్షణ, ప్రమాణాల శాఖ ఆధ్వర్యంలో అడిషనల్కలెక్టర్ రోహిత్ సింగ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్ తో కలిసి ఆహార భద్రతపై మీటింగ్ నిర్వహించారు.
ఆహార భద్రతపై ఆహార తయారీ, విక్రయదారులకు ముందుగా అవగాహన కార్యక్రమం చేపట్టాలని ఆహార భద్రత అధికారులకు సూచించారు. టాస్క్ఫోర్స్ బృందం ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో మల్లికార్జున రావు, ఫ్లోరెన్స్, డీఏవో రామారావు నాయక్, మున్సిపల్కమిషనర్ వెంకటేశ్వర్లు, కృష్ణమూర్తి, వినీల్, సాధిక్ అలీ తదితరులు పాల్గొన్నారు.