![నాణ్యమైన విద్యనందించేందుకు చర్యలు : కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్](https://static.v6velugu.com/uploads/2025/02/collector-rizwan-basha-sheikh-said-government-has-taken-steps-to-provide-quality-education-to-students_OngXrscb62.jpg)
స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు: స్టూడెంట్లకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ తెలిపారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం రాజవరం గ్రామ శివారులోని కస్తూర్భా గాంధీ గర్ల్స్ స్కూల్‌ను గురువారం కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్లోని టీచింగ్ స్టాఫ్ అటెండెన్స్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించారు. ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను స్టూడెంట్లకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.
స్కూల్లోని రూమ్స్ తలుపులు, కిటికీల పనులు సత్వరమే పూర్తిచేయాలని ఇంజనీరింగ్ ఆఫీసర్లకు గట్టిగా చెప్పారు. చదువులో ప్రతిభ కనబరచాలని, 100 శాతం ఫలితాలను సాధించాలని స్టూడెంట్స్‌కు సూచించారు. ఆర్డీవో వెంకన్న, డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ప్రశాంతి, ఎంపీడీవో వెంకన్న, తహసీల్దార్ సరస్వతీ, డీటీ రామారావు, పాల్గొన్నారు.