విష జ్వరాలపై అలర్ట్​గా ఉండాలి : కలెక్టర్ రిజ్వాన్​బాషా షేక్

జనగామ అర్బన్, వెలుగు: వర్షాకాలం నేపథ్యంలో విష జ్వరాలు వ్యాపించకుండా ప్రజలు, అధికారులు అలర్ట్​గా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్​బాషా షేక్ సూచించారు. 

శుక్రవారం జనగామ మున్సిపాలిటీలోని 7, 10  వార్డులను ఆయన పరిశీలించారు. కాలనీ వాసులతో మాట్లాడుతూ ప్రతి శుక్రవారం డ్రై డే గా పాటించాలని చెప్పారు. విష జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, వార్డు అధికారి సదానందం, శానిటరీ ఇన్​స్పెక్టర్ గోపయ్య తదితరులు పాల్గొన్నారు.