జనగామ, వెలుగు : రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో డీసీపీ రాజమహేంద్ర నాయక్‌తో కలిసి జిల్లాస్థాయి రహదారి భద్రత కమిటీ సభ్యులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నేషనల్ హైవేలు, ఇతర రోడ్ల కనెక్టివిటీ వద్ద స్పీడ్ బ్రేకర్లు, ప్రమాదాలు జరిగే చాన్స్ చోట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్, సిద్దిపేట వైపు నేషనల్ హైవేలపై పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఏఎస్పీ పండరి చేతన్ నితిన్, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఘన్పూర్ ఏసీపీ భీం శర్మ తదితరులు పాల్గొన్నారు.
కంది కొనుగోలు కేంద్రం ప్రారంభం..
జనగామ అగ్రికల్చర్ మార్కెట్‌యార్డులో కంది కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రారంభించారు. మార్క్‌ఫెడ్ ద్వారా క్వింటాలుకు రూ.7,550 ధర కల్పిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఏఈవో వద్ద ధ్రువీకరణ పత్రంతోపాటు తమ పట్టాదారు పాసుబుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్‌లను వెంట తెచ్చుకోవాలని సూచించారు. జిల్లా మార్క్ ఫెడ్ అధికారి రంజిత్ రెడ్డి, మార్కెటింగ్అధికారి నరేందర్, మార్కెట్సెక్రటరీ శ్రీనివాస్, అగ్రికల్చర్ ఆఫీసర్ రామారావు తదితరులు పాల్గొన్నారు.