జనగామ అర్బన్, వెలుగు : షెడ్యూల్ కులాల విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ పథకాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కోరారు. మంగళవారం కలెక్టరేట్ లో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రెండో విడతగా బెస్ట్ అవైలబుల్ స్కీం కింద 1, 5 తరగతులకు లక్కీ డ్రా పద్ధతిన విద్యార్థుల ఎంపిక చేశారు.
జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి దయానందరాణి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.