
జనగామ అర్బన్, వెలుగు: ఎల్‌ఆర్‌ఎస్ కింద రెగ్యులరైజ్ చేసుకున్న వారికే నిర్మాణాలకు అనుమతులు వస్తాయని , మార్చి 31 లోగా ఎల్‌ఆర్‌ఎస్ రుసుము చెల్లించిన వారికే 25% తగ్గింపు ఉంటుందని జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. గురువారం మున్సిపల్ ఆఫీస్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో 62 వేల దరఖాస్తులు ఎల్ఆర్ఎస్కు వచ్చాయన్నారు.
మున్సిపాలిటీలో 16 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. కలెక్టరేట్ఆఫీసుల్లో హెల్ప్ డెస్క్లు పెట్టామన్నారు. సందేహాల నివృత్తికి కలెక్టరేట్‌లో 99481 87334 మున్సిపల్ ఆఫీస్లో 89782 07205 లో సంప్రదించవచ్చని తెలిపారు. జనగామ ఆర్డీవో గోపిరాం, డీటీసీపీవో వీరస్వామి, మున్సిపల్ కమిషనర్లు వెంకటేశ్వర్లు, రవీందర్, సబ్ రిజిస్టార్లు, తహసీల్దార్లు, రియల్ ఎస్టేటర్లు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.