కరీంనగర్ టౌన్, వెలుగు: జిల్లాలో కస్టమ్ మిల్లింగ్‌రైస్ ఇవ్వని 81 మిల్లులకు నోటీసులు ఇవ్వాలని సివిల్సప్లై ఆఫీసర్లను కలెక్టర్ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో రైస్‌మిల్లర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022-–-23 వానాకాలం వడ్లకు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైస్అప్పగింతపై వారంలోపు పురోగతి కన్పించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, ట్రైనీ కలెక్టర్ నవీన్ నికోలస్ పాల్గొన్నారు.
ఎలక్టోరల్ రోల్ పరిశీలించిన ఎలక్షన్ కమిషన్జిల్లాలో నిర్వహిస్తున్న ఎలక్టోరల్ రోల్ ను ఎలక్షన్ కమిషన్ సభ్యులు ఎస్‌బీ జోషి, ఎస్హెచ్ప్రఫుల్ అవాస్తి పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు, సూపర్ వైజర్లతో సమీక్షించారు. ఇంటింటి సర్వే రికార్డులను పరిశీలించారు.