నల్గొండ అర్బన్, వెలుగు : మద్యం, మనీ సరఫరాపై పటిష్ట నిఘా పెట్టామని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ ఆదేశించారు. బుధవారం వాడపల్లి వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ను ఎస్పీ అపూర్వ రావు, ఏపీలోని పల్నాడు కలెక్టర్ ఎల్.శివ శంకర్, ఎస్పీ రవి శంకర్ రెడ్డితో కలిసి తనిఖీ చేశారు. అనంతరం వాడపల్లి పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఇరు రాష్ట్రాల పోలీస్, ఎక్సైజ్, రవాణా, వాణిజ్య పన్నులు, అటవీ శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అంతర్ జిల్లా, అంతరాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని చెప్పారు.
Also Read :- బాల్కసుమన్ గూండాయిజానికి ఇదే నిదర్శనం : వివేక్ వెంకటస్వామి ఆగ్రహం
అక్రమ మద్యం, నగదు, డ్రగ్స్ సరఫరా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ విషయంలో ఇరు రాష్ట్రాల అధికారులు సమచారాన్ని షేర్ చేసుకోవాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో వాడపల్లి, నాగార్జున సాగర్ , సాగర్ టెయిల్ పాండ్ వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. అనంతరం పల్నాడు కలెక్టర్ శివ శంకర్ మాట్లాడుతూ.. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద ఏపీ వైపు నంచి నిఘా పెట్టామని, ఇప్పటికే దాచేపల్లి మండలం పొందుగల, సాగర్, సత్రశాల వద్ద చెక్ పోస్టులు పని చేస్తున్నట్లు వివరించారు. మిర్యాలగూడ డీఎస్పీ వి.వెంకట గిరి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్, ఆర్టీవో సురేశ్, అధికారులు పాల్గొన్నారు.