నల్గొండ అర్బన్, వెలుగు: విద్యార్థులను సైంటిస్టులు తీర్చిదిద్దేందుకు టీచర్లు కృషి చేయాలని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ సూచించారు. నల్గొండ పట్టణంలోని గంధవారిగూడెం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో మూడు రోజులుగా జరుగుతున్న జోనల్ లెవెల్ సైన్స్ ఫెయిర్ బుధవారం ముగిసింది.
ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ఎగ్జిబిట్లను పరిశీలించారు. అనంతరం ఉత్తమ ఎగ్జిబిట్లు ప్రదర్శించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్సీవో హెచ్. అరుణకుమారి, ప్రిన్సిపల్ లలిత కుమారి, గురుకుల ప్రధానాచార్యుల సంఘం అధ్యక్షుడు అంజయ్య పాల్గొన్నారు.