సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఆర్వీ కర్ణన్

నల్గొండ అర్బన్, వెలుగు : సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో పారిశుధ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని కలెక్టర్​ ఆర్వీ కర్ణన్​ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని ఉదయాదిత్య భవన్ లో వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లు, ఎంపీడీఓలతో సమీక్ష నిర్వహించారు. సీజనల్‌వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పీహెచ్​సీలు, బస్తీ దవాఖానల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు కృషి చేయాలన్నారు.

ALSO READ: హైదరాబాద్లో ఎన్ఐఏ సోదాలు.. పాతబస్తీ సహా నాలుగుచోట్ల కొనసాగుతున్న రైడ్స్

అన్ని పీహెచ్​సీలలో, బస్తీ దవాఖానల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు వైద్యశాఖ ఇప్పటికే కిట్లను సిద్ధం చేసిందని చెప్పారు. డెంగీ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో దోమల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. డెంగ్యూ కేసుల వివరాలను మండలాల వారీగా తెలుసుకోవాలని చెప్పారు. మహిళలకు మాస్టర్ చెకప్ లో భాగంగా ఎనిమిది రకాల టెస్టులను చేసి రిపోర్టులను అందజేయాలని ఆదేశించారు.

సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, డీఎంహెచ్​ఓ డాక్టర్​ కొండల్ రావు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. లచ్చు, డీసీహెచ్​ఎస్​ డా.మాతృ, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.రాజ కుమారి, జడ్పీసీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, డీపీఓ విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.