కలెక్టరేట్ పనుల్లో వేగం పెంచాలి : కలెక్టర్ వెంకట్‌రావు

కలెక్టర్ వెంకట్‌రావు

సూర్యాపేట వెలుగు : కలెక్టరేట్ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ ఎస్‌ వెంకట్‌రావు సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శనివారం  అడిషినల్ కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్‌తో కలసి కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కాంపౌండ్ వాల్, రోడ్ల పనులు త్వరగా పూర్తి చేయాలని, ఆవరణను గ్రీనరీతో నింపేయాలని సూచించారు.  

లేబర్‌‌ను పెంచి సిబ్బంది నివాస గృహాలను కంప్లీట్ చేయాలన్నారు. కలెక్టరేట్‌ను త్వరలోనే సీఎం కేసీఆర్‌‌ ప్రారంభిస్తారని, పనులు లేట్‌ కాకుండా అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌‌అండ్‌బీ ఎస్‌ఈ  నర్సింహ నాయక్, ఈఈ యాకుబ్, కాంట్రాక్టర్‌‌   పాల్గొన్నారు.