
వనపర్తి, వెలుగు: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను బలోపేతం చేసి జిల్లా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గాంగ్వార్ తెలిపారు. అడిషనల్ కలెక్టర్ గా నియమితులైన ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించారు. అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) ఎస్. తిరుపతి రావు బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి జిల్లాలోని మున్సిపాలిటీలు, పంచాయతీల డెవలప్మెంట్ కోసం కృషి చేస్తానన్నారు.
డీఆర్డీవో నరసింహులు, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహా రెడ్డి, డీడబ్ల్యూవో రామ మహేశ్వర రెడ్డి, కలెక్టరేట్ ఏవో భానుప్రకాశ్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది బొకేలు, పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు.