వనపర్తిలో మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేస్తా :  సంచిత్  గాంగ్వార్

వనపర్తిలో మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేస్తా :  సంచిత్  గాంగ్వార్

వనపర్తి, వెలుగు: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను బలోపేతం చేసి జిల్లా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అడిషనల్ కలెక్టర్  సంచిత్  గాంగ్వార్ తెలిపారు. అడిషనల్  కలెక్టర్ గా నియమితులైన ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించారు. అడిషనల్  కలెక్టర్(రెవెన్యూ) ఎస్. తిరుపతి రావు బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి జిల్లాలోని మున్సిపాలిటీలు, పంచాయతీల డెవలప్​మెంట్​ కోసం కృషి చేస్తానన్నారు.

డీఆర్డీవో నరసింహులు, మున్సిపల్  కమిషనర్  విక్రమ్ సింహా రెడ్డి, డీడబ్ల్యూవో రామ మహేశ్వర రెడ్డి, కలెక్టరేట్  ఏవో భానుప్రకాశ్, జిల్లా అధికారులు, కలెక్టరేట్  సిబ్బంది బొకేలు, పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు.