ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుకను ఉచితంగా అందించాలని రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్‌‌‌‌‌‌‌‌కుమార్ ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అందించే ఫ్రీ ఇసుకకు కేవలం ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్టు చార్జీలు మాత్రమే తీసుకోవాలన్నారు. గతంలో నిర్మించి మధ్యలో వదిలేసిన ఇండ్లను ఈ పథకంలో చేర్చొద్దని సూచించారు. 

పైలెట్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ కింద ఎంపికైన గ్రామాలు, వార్డుల్లో లక్ష్యం మేరకు నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ  సీఈవో వినోద్‌‌‌‌‌‌‌‌కుమార్, డీఆర్డీవో శేషాద్రి, పీడీ హౌసింగ్ శంకర్, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

స్టూడెంట్స్​కు కలెక్టర్​ అభినందన 

ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన స్టూడెంట్స్​ను కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందీప్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఝా అభినందించారు. వేములవాడ మైనార్టీ సంక్షేమ గురుకుల స్కూల్‌‌‌‌‌‌‌‌కు చెందిన  హేమంత్ ఎంఎల్‌‌‌‌‌‌‌‌టీ కోర్సులో  500కు 496 మార్కులతో స్టేట్​ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ర్యాంకు, షరీఫ్​ ఎంఎల్‌‌‌‌‌‌‌‌డీటీలో 483 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్‌‌‌‌‌‌‌‌ సాధించారు. ఈ సందర్భంగా స్టూడెంట్లతోపాటు గురుకుల స్కూల్‌‌‌‌‌‌‌‌ ప్రిన్సిపాల్ పి.లక్ష్మీనారాయణ, లెక్చరర్లను అభినందించారు.