రైతులకు అందుబాటులో ఉండి సేవలందించాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రైతులకు అందుబాటులో ఉండి సేవలందించాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల, వెలుగు: రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఉత్తమ సేవలు అందించాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో అగ్రికల్చర్ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మండలాల్లో ఏఏ పంటలు సాగు చేశారు, ఎరువుల సప్లైపై ఆరా తీశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు రైతులకు చేరేలా చూడాలన్నారు. రైతుల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో నమోదు చేయాలన్నారు. ఫర్టిలైజర్ దుకాణాలను నిత్యం తనిఖీ చేయాలని, అందులో ఎరువులు, పురుగుమందుల నిల్వలను చెక్‌‌‌‌‌‌‌‌ చేయాలన్నారు. కార్యక్రమంలో డీఏవో అఫ్జల్ బేగం, ఏడీఏ రామారావు, ఏవోలు పాల్గొన్నారు.