రాజన్న సిరిసిల్ల, వెలుగు: మున్సిపాలిటీలోని అధికారులు తమ విధులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. బుధవారం జిల్లాలోని మున్సిపాలిటీలపై కలెక్టరేట్‌లో అధికారులతో రివ్యూ నిర్వహించారు. బల్దియాల్లోని సిబ్బంది, అధికారుల వివరాలు, వారి విధులు, శానిటరీ డోర్ కలెక్షన్.. తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ సిబ్బందికి అనుమతి లేకుండా సెలవులు తీసుకోవద్దన్నారు. సిరిసిల్ల పట్టణాలలో పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగ్గా అమలు చేయాలని, ప్రతి రోజూ ఉదయం సిబ్బంది అటెండెన్స్ పక్కాగా నమోదు జరగాలన్నారు. మున్సిపల్ వాహనాలకు ప్రభుత్వ పెట్రోల్ బంక్‌లో మాత్రమే డీజిల్ కొట్టించాలన్నారు. మీటింగ్ సిరిసిల్ల కమిషనర్ లావణ్య, అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.