కోనరావుపేట, వెలుగు: వడ్ల కొనుగోలు సెంటర్లలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నిర్వాహకులు ఆదేశించారు. గురువారం కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందన్నారు.
వర్షాల వల్ల వడ్లు తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్, సివిల్ సప్లై ఆఫీసర్ వసంత లక్ష్మి, మేనేజర్ రజిత, జిల్లా సహకార శాఖ అధికారి రామకృష్ణ, ఎంపీడీవో శ్రీనివాసమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.