ఫిబ్రవరి 25 నుంచి మహాశివరాత్రి జాతర : కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందీప్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఝా

 ఫిబ్రవరి 25 నుంచి మహాశివరాత్రి జాతర : కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందీప్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఝా
  • వేములవాడలో జాతర నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి

రాజన్న సిరిసిల్ల, వెలుగు: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మహా శివరాత్రి జాతరను సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జాతర ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో ఎస్పీ అఖిల్ మహాజన్, రాజన్న ఆలయ ఈవో, ఇతర శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. శివరాత్రి సందర్భంగాఅదనపు బస్సులు, శానిటేషన్‌‌‌‌‌‌‌‌, పార్కింగ్, దేవాలయం వద్ద వసతి, తాగునీరు, హెల్త్‌‌‌‌‌‌‌‌ క్యాంపుల ఏర్పాటు, కల్యాణకట్ట, ధర్మగుండం, బద్ది పోచమ్మ ఆలయం, హెల్ప్ సెంటర్, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ నెల 25 నుంచి 27 వరకు మహా శివరాత్రి జాతర నిర్వహించనున్నట్లు చెప్పారు.

 నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి పూర్తిచేయాలన్నారు. జాతరకు వచ్చే భక్తుల రద్దీకనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయ పరిసరాల్లో పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేయాలన్నారు. ఫోన్ సిగ్నల్స్ సమస్య రాకుండా ఆపరేటర్లతో చర్చించి తాత్కాలిక టవర్ల ఏర్పాటు చేయాలని అన్నారు. వివిధ డిపోల నుంచి మొత్తం 857 బస్సులు నడిపించనున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా 20 లక్షల లీటర్ల నీటిని సప్లై చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. 

500 మంది శానిటేషన్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది అందుబాటులో ఉంటారని మున్సిపల్ కమిషనర్ అన్వేష్​ తెలిపారు. 8 ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజిన్లు, ఇప్పటికే 260 సీసీ కెమెరాలు ఉండగా మరో 180 కెమెరాలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. 24 మంది గజ ఈతగాళ్లు సేవలు అందిస్తారని అధికారులు వివరించారు. 3 లక్షల లడ్డూలు, ప్రసాదం సిద్ధం చేస్తామని ఈవో వెల్లడించారు. జాతర సందర్భంగా గుడి చెరువు ప్రాంతంలో భక్తులకు అల్పాహారం ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు వివరించారు.