రాజన్న ఆలయంలో కోడెల పంపిణీకి అనుమతి తప్పనిసరి

రాజన్న ఆలయంలో కోడెల పంపిణీకి అనుమతి తప్పనిసరి

రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాజన్న దేవాలయం గోశాలకు సంబంధించిన కోడెల పంపిణీకి తప్పనిసరిగా తమ అనుమతి తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందీప్ కుమార్ ఝా అధికారులకు సూచించారు. మంగళవారం వేములవాడ ఆలయ గోశాల నిర్వహణ, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో రివ్యూ చేశారు. ఆయన మాట్లాడుతూ ఇక నుంచి తమ అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితులలో గోశాల నుంచి కోడెలు, ఆవులను  రైతులకు పంపిణీ చేయొద్దన్నారు. 

జిల్లాలో ఇప్పటివరకు 1,975 పశువులను పంపిణీ చేశామన్నారు. మొదటి, రెండు దశల్లో తమ అనుమతి తీసుకున్నారని, మూడో సారి కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకుండా ఎలా పంపిణీ చేశారని అధికారులను ప్రశ్నించారు. దీనిపై సమగ్ర నివేదిక అందించాలన్నారు. వచ్చే శుక్రవారం నాటికి జిల్లాలో పంపిణీ చేసిన 1,975 పశువుల స్థితిపై నివేదిక ఇవ్వాలన్నారు. సమావేశంలో వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, ఆలయ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి ఈవో రాజేష్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో శ్రీధర్, తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. 

టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎత్తేయాలని వినతి 

ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జడ్పీ హైస్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంగ్లీష్​ టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్న లింగాల రాజు స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మత ప్రచారం చేస్తూ ఇటీవల సస్పెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన విషయం తెలిసిందే. మంగళవారం పలువురు పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసి సదరు టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎత్తివేయాలని కోరారు. టెన్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమీపిస్తున్నాయని, ఈ టైంలో ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో పిల్లలు తీవ్రంగా నష్టపోతారని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దృష్టికి తీసుకెళ్లారు.