- జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ గోవులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిధిలోని తిప్పాపూర్ గోశాలను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోశాల ఆవరణ, అక్కడ చేపడుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
గోశాలలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సివిల్ పనులను నిర్దేశిత గడువులోగా చేయాలని సూచించారు. గోవుల సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. దాణా ఇతర విషయాల్లో జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. వారి వెంట జిల్లా పశు సంవర్థక అధికారి రవీందర్ రెడ్డి, వేములవాడ రాజన్న ఆలయ ఈఓ ఈఓ వినోద్ రెడ్డి, ఈఈ రాజేష్, తదితరులు ఉన్నారు.