పీహెచ్‌‌‌‌సీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

పీహెచ్‌‌‌‌సీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

వీర్నపల్లి, వెలుగు: ప్రైమరీ హెల్త్ సెంటర్(పీహెచ్‌‌‌‌సీ) సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. గురువారం వీర్నపల్లి మండల కేంద్రంలో పీహెచ్‌‌‌‌సీ బిల్డింగ్‌‌‌‌కు భూమిపూజ చేశారు. అనంతరం ఓ ప్రైవేట్ బిల్డింగ్‌‌‌‌లో పీహెచ్‌‌‌‌సీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతమైన వీర్నపల్లి మండలంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఇన్‌‌‌‌చార్జి ఆర్డీవో రాదాబాయి, డీఎంహెచ్‌‌‌‌వో రజిత, మెడికల్‌‌‌‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.