వేములవాడ, వెలుగు: వేములవాడ ఏరియా హాస్పిటల్‌ను రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా బుధవారం తనిఖీ చేశారు. హాస్పిటల్‌లో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్‌లోని వార్డులను పరిశీలించి రోగులతో మాట్లాడారు. వైద్య సేవలు ఎలా ఉన్నాయి..? డాక్టర్లు, సిబ్బంది వైద్యం ఎలా చేస్తున్నారని రోగులను ప్రశ్నించారు.
అనంతరం డాక్టర్లతో మాట్లాడుతూ మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆయన వెంట డీఎంహెచ్‌వో వసంతరావు, పర్యవేక్షకులు పెంచలయ్య, ఆర్ఎంవో సంతోష్‌చారి, డాక్టర్లు దీప్తి, అనిల్ ఉన్నారు.